8, జనవరి 2012, ఆదివారం

"జోక్చాతుర్యం" కాదు" వాక్చాతుర్యం"

ఒక పల్లెటూరి వాడు ఒక పని మీద, పట్నానికి వెళ్ళాడు.
తన పని చూసుకొని,ఒక చక్కని
భోజన హోటల్ కు వెళ్ళాడు.
అక్కడ కడుపు నిండుగా,తృప్తిగా భోజనం చేశాడు.
మరి!అది కాస్తాఅరిగించుకోవాలిగా!కిళ్ళీ వేస్తే, బాగుంటుందని భావించాడు.
ఒక కిళ్ళీ కొట్టు దగ్గరకు వెళ్ళి "మాంచి జరదాకిళ్ళీ ఒకటి కట్టవోయ్" అన్నాడు.
కొట్టు వాడు ఆ పనిలో ఉండి, వీడి చర్యల్నిఅతి జాగ్రత్తగా గమనిస్తున్నాడు.
ఆ కొట్టుకు ఎదురుగా,అమ్మకానికి ఒక అరటి పళ్ళ గెల వ్రేలాడ
దీసి ఉంది!
మన వాడు తిన్నగా ఉండక "పళ్ళు బాగున్నాయే!"అని వాటిమీద చెయ్యేశాడు ఎంతో సుతారంగా.......
"గెల మీద చెయ్యెయ్యకోయ్!పళ్ళు రాల్తాయి జాగ్రత్త!"అన్నాడు ఎంతో తెలివిగా.వీడేమైనా!తక్కువ తిన్నాడా!ఏమిటి?మరికాస్త..... తెలివిని! ప్రదర్శిస్తూ!
"ఆకుల్లో!సున్నం!ఎక్కువ రాయకోయ్! దవడూడుతుంది! జాగ్రత్త! " అన్నాడు   

"కొట్టు వాడు గట్టి పిండమే"!అని కిళ్ళీ ఇచ్చి డబ్బుతీసుకుని,పంపేశాడు!
చూశారా!వాళ్ళ"జోక్చాతుర్యం"!కాదు!కాదు!"వాక్చాతుర్యం"!